South Central Railway: భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

South Central Railway Cancels multiple trains in the view of heavy trains

  •  ప్యాసింజర్ రైళ్లతోపాటు ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు 
  • నేటి నుంచి 17వ తేదీ వరకు రద్దు చేసినట్టు వెల్లడి
  • 34 ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు

భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు ప్యాసింజర్ రైళ్లతోపాటు ఎంఎంటీఎస్ రైళ్లను కూడా రద్దు చేసింది. నేటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు సికింద్రాబాద్-ఉందానగర్-సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలు, సికింద్రాబాద్-ఉందానగర్ మెము రైలు, మేడ్చల్-ఉందానగర్ మెము, ఉందానగర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-ఉందానగర్ స్పెషల్ మెము రైళ్లతోపాటు హెచ్.ఎస్ నాందేడ్-మేడ్చల్-హెచ్ఎస్ నాందేడ్, సికింద్రాబాద్-మేడ్చల్ మెము రైలు, మేడ్చల్-సికింద్రాబాద్ మెము రైలు, కాకినాడ పోర్టు-విశాఖపట్టణం మెము రైలు, విజయవాడ-బిట్రగుంట మెము రైలును రద్దు చేస్తున్నట్టు తెలిపింది.

అలాగే, హైదరాబాద్, సికింద్రాబాద్ మీదుగా నడిచే 34 ఎంఎంటీఎస్ రైళ్లను కూడా దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఇవి కూడా నేటి నుంచి 17 వరకు అందుబాటులో ఉండవని రైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్ రూట్‌లో 9 సర్వీసులు, హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో 9 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య 7 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా మధ్య 7, సికింద్రాబాద్-లింగపల్లి రూట్‌లో ఒకటి, లింగంపల్లి-సికింద్రాబాద్ రూట్‌లో ఒక సర్వీసును అధికారులు రద్దు చేశారు. అలాగే, ఉందానగర్-మేడ్చల్, సికింద్రాబాద్-బొల్లారం, బొల్లారం-సికింద్రాబాద్, మేడ్చల్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-మేడ్చల్ మెము స్పెషల్ రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

  • Loading...

More Telugu News