Microsoft: మైక్రోసాఫ్ట్ లో 1,800 మందికి ఉద్వాసన

Microsoft lays off 1800 employees as part of restructuring process
  • వ్యాపార కార్యకలాపాల పునర్ నిర్మాణంలో భాగమేనని ప్రకటన
  • సాధారణ నియామకాలు కొనసాగుతాయని స్పష్టీకరణ
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులను పెంచుకుంటామని వెల్లడి
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ మైక్రోసాఫ్ట్ 1,800 మంది ఉద్యోగులను తొలగించనుంది. వ్యాపార కార్యకలాపాల సర్దుబాటు కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో కొన్ని విభాగాల నుంచి ఈ మేరకు ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించింది. అదే సమయంలో ఉద్యోగుల నియామకాలు ఎప్పటి మాదిరే కొనసాగుతాయని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికరంగా ఉద్యోగులను పెంచుకుంటామని తెలిపింది.

‘‘అన్ని కంపెనీల మాదిరే మేము కూడా మా వ్యాపార ప్రాధాన్యతలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటాం. అందుకు తగ్గట్టు ఉద్యోగుల్లో మార్పులు చేస్తుంటాం. మేము తొలగించే ఉద్యోగులు ఒక శాతం మేరకే ఉంటారు’’ అని స్పష్టం చేసింది. 

మైక్రోసాఫ్ట్ లో ప్రపంచవ్యాప్తంగా 1.8 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇప్పటికే గూగుల్, ఫేస్ బుక్, స్పాన్ చాట్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఈ విధమైన నిర్ణయాలను తీసుకున్నాయి. కేవలం నైపుణ్య మానవ వనరులను తీసుకుంటామని, సాధారణ నియామకాలు తగ్గించుకుంటామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు వెల్లడించడం తెలిసిందే. ఆర్థిక ప్రతికూల పరిస్థితులు కంపెనీలతో ఈ దిశగా అడుగులు వేయించేలా చేస్తున్నట్టు అర్థమవుతోంది. 

Microsoft
lays off
employees
restructuring

More Telugu News