Team India: రెండో వ‌న్డేలోనూ టాస్ నెగ్గిన హిట్ మ్యాన్‌.. ఫీల్డింగ్ ఎంపిక

indian captain rohit sharma wins toss and elect to bowl first
  • లండ‌న్‌లోని లార్డ్స్ మైదానం వేదిక‌గా మ్యాచ్‌
  • బౌలింగ్ ఎంచుకుని ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన రోహిత్‌
  • ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియాదే సిరీస్‌
ఇంగ్లండ్ టూర్‌లో టీమిండియా టెస్టు మ్యాచ్‌లో ఓడినా...ఆ త‌ర్వాత స‌త్తా చాటుతోంది. ఇప్ప‌టికే టీ20 సిరీస్‌ను గెలిచిన రోహిత్ సేన తాజాగా వ‌న్డే సిరీస్‌పైనా క‌న్నేసింది. ఇప్ప‌టికే ముగిసిన తొలి వ‌న్డేలో ఇంగ్లండ్ జ‌ట్టును చిత్తుగా ఓడించి... 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా గురువారం లండ‌న్‌లోని ప్ర‌తిష్ఠాత్మ‌క లార్డ్ మైదానం వేదిక‌గా రెండో వ‌న్డేకు టీమిండియా రెడీ అయిపోయింది.

కాసేప‌టి క్రితం రెండో వ‌న్డేకు సంబంధించిన టాస్ ముగిసింది. తొలి మ్యాచ్ మాదిరే రెండో మ్యాచ్‌లోనూ హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌నే టాస్ వ‌రించ‌గా... ఏమాత్రం ఆలోచించ‌ని రోహిత్ తొలి మ్యాచ్ వ్యూహాన్నే ఎంచుకున్నాడు. తొలుత బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న రోహిత్ ఆతిథ్య జ‌ట్టును ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో నెగ్గితే మూడో వ‌న్డే ఫ‌లితంతో సంబంధం లేకుండానే టీమిండియా వ‌న్డే సిరీస్‌ను చేజిక్కించుకుంటుంది. ఇంగ్లండ్ గెలిస్తే... మూడో వ‌న్డేలో టీమిండియా చెమ‌టోడ్చాల్సి ఉంటుంది.
Team India
England
Rohit Sharma
Lord's
London

More Telugu News