Indian investors: అమెరికా స్టాక్స్ ను సైలెంట్ గా కొంటున్న భారత ఇన్వెస్టర్లు

Indian investors are busy buying the dip even on Wall Street

  • గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, ఫేస్ బుక్, అమెజాన్ కు ప్రాధాన్యం
  • ఈటీఎఫ్ ల రూపంలోనూ అమెరికా స్టాక్స్ లో పెట్టుబడులు
  • డేటా వెల్లడించిన వెస్టెడ్ ఫైనాన్స్

భారత ఇన్వెస్టర్లు పరిణతి ప్రదర్శిస్తున్నారు. ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడమే కాదు.. వైవిధ్యం కోసం విదేశీ స్టాక్స్ ను కూడా ఖాతాలో వేసుకుంటున్నారు. గడిచిన ఆరు నెలల కాలంలో అమెరికా మార్కెట్లు సగం మేర దిద్దుబాటుకు గురయ్యాయి. దీంతో భారత ఇన్వెస్టర్లు అమెరికా స్టాక్స్ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్టు వెస్టెడ్ ఫైనాన్స్ ప్లాట్ ఫామ్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. వెస్టెడ్ ఫైనాన్స్ అన్నది అమెరికా స్టాక్స్ లో క్రయ విక్రయ సేవలను భారతీయులకు అందించే సంస్థ.

జూన్ త్రైమాసికంలో ఈ ప్లాట్ ఫామ్ పై ట్రేడింగ్ వ్యాల్యూమ్ 22 శాతం పెరిగింది. భారత ఇన్వెస్టర్లు విక్రయిస్తున్న అమెరికా స్టాక్స్ విలువతో పోలిస్తే.. వారు కొనుగోలు చేస్తున్న స్టాక్స్ విలువ రెండు రెట్లు అధికంగా ఉంది. భారతీయ ఇన్వెస్టర్లు ఎక్కువ మంది టెస్లా, అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. 

ఈటీఎఫ్ ల రూపంలోనూ అమెరికా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వాన్ గార్డ్ ఎస్అండ్ పీ 500 ఈటీఎఫ్, ఇన్వెస్కో క్యూక్యూక్యూ ఈటీఎఫ్ లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. అమెరికా టెక్నాలజీ స్టాక్స్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని చూస్తున్న తరుణంలో భారత ఇన్వెస్టర్లు కనిష్ఠాల వద్ద కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్టు వెస్టెడ్ ఫైనాన్స్ తెలిపింది.

  • Loading...

More Telugu News