Kiran Abbavaram: మైత్రీ బ్యానర్ నుంచి మరో మాస్ మూవీ .. టైటిల్ పోస్టర్ రిలీజ్!

Kiran Abbavaram in new movie title poster
  • కిరణ్ అబ్బవరం హీరోగా మరో మూవీ 
  • టైటిల్ గా 'మీటర్' ఖరారు'
  • రమేశ్ కాడూరి దర్శకత్వం 
  • సంగీత దర్శకుడిగా సాయికార్తీక్
ఏ మాత్రం గ్యాప్ రాకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన మాస్ టచ్ ఉండే పాత్రలను చేస్తూ వెళుతున్న కిరణ్, ఈ రోజున తన పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన కొత్త ప్రాజెక్టుల నుంచి అప్ డేట్స్ వస్తున్నాయి. 
 
తాజాగా మైత్రీ మూవీస్ వారు తమ బ్యానర్ లో కిరణ్ చేస్తున్న సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాకి 'మీటర్' అనే టైటిల్ ను సెట్ చేసినట్టుగా చెబుతూ .. కిరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. పోస్టర్ చూస్తుంటేనే ఇది పక్కా మాస్ ఎంటర్టయినర్ అనే విషయం అర్థమవుతోంది.

రమేశ్ కాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, సాయి కార్తీక్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇక కిరణ్ హీరోగా గీతా ఆర్ట్స్ 2లో 'వినరో భాగ్యము విష్ణుకథ' .. కోడి దివ్య బ్యానర్లో 'నేను మీకు చాలా కావాల్సినవాడిని' చేస్తున్న సంగతి తెలిసిందే. కుర్ర హీరోల పరంగా చూసుకుంటే కిరణ్ మాంచి దూకుడు మీదే ఉన్నాడు..
Kiran Abbavaram
Ramesh

More Telugu News