Kangana Ranaut: ఇందిరా గాంధీగా కంగన రనౌత్ లుక్ అదుర్స్

Kangana Ranaut becomes Indira Gandhi in Emergency first look revealed
  • ‘ఎమర్జెన్సీ‘ చిత్రంలో ఇందిరగా కంగన
  • తనే దర్శకత్వం వహిస్తున్న వైనం   
  • ఫస్ట్ లుక్, టీజర్ విడుదల
తన నటనతోనే కాకుండా వ్యక్తిత్వంలో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటి కంగన రనౌత్. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయే ఆమె ఈ మధ్య వరుసగా బయోపిక్ సినిమాల్లో నటిస్తోంది. ఆ మధ్య ’మణికర్ణిక’లో ఝాన్సీ లక్ష్మీబాయిగా అలరించిన కంగన.. ‘తలైవి’ చిత్రంలో జయలలిత పాత్రలో మెప్పించింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసిందామె. 
 
ఏకంగా ఉక్కు మహిళ, భారత  మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో ఆమె ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందిర ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఆ బ్యాక్‌డ్రాప్‌లోనే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనికి ‘ఎమర్జెన్సీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మణికర్ణికతో మెగా ఫోన్ పట్టిన కంగనే ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం మరో విశేషం. 
 
ఈ విషయాన్ని ప్రకటించడంతో పాటు చిత్రంలో కంగన ఫస్ట్ లుక్, టీజర్ ను కూడా విడుదల చేశారు. ఇందులో కంగన.. అచ్చం ఇందిరను మరిపించింది.‘అమెరికా ప్రెసిడెంట్‌కి చెప్పు.. ఇక్కడ అందరూ నన్ను మేడమ్‌ అని కాదు, సర్‌‌ అని పిలుస్తారని’ అనే డైలాగ్ తో ఉన్న టీజర్ ఆకట్టుకుంటోంది.
Kangana Ranaut
Bollywood
Indira Gandhi
Emergency

More Telugu News