Monkeypox Virus: కేరళలో మంకీపాక్స్ తొలికేసు.. మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Govt Issues Monkeypox Guidlines

  • దేశంలోనే తొలిసారి కేరళలో కేసు వెలుగులోకి
  • వైద్యశాఖ ఉన్నతాధికారులతో డీహెచ్ సమీక్ష
  • కేంద్ర మార్గదర్శకాలను అన్ని జిల్లాలకు పంపిన అధికారులు
  • భారత్ సహా 50 దేశాలకు విస్తరించిన మంకీపాక్స్

దేశంలోనే తొలిసారి కేరళలో మంకీపాక్స్ (Monkeypox) కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజారోగ్య సంచాలకుడు (DH) డాక్టర్ జి.శ్రీనివాసరావు నిన్న ఆదేశాలు జారీ చేశారు. 

అలాగే, మంకీపాక్స్‌ను ఎదుర్కోవడమెలా? ఎలాంటి రోగుల నుంచి శాంపిల్స్ సేకరించాలి? మంకీపాక్స్ సోకినట్టు ఎలా గుర్తించాలి? వ్యాధి వ్యాప్తి చెందకుండా ఎలా అడ్డుకోవాలి? వంటి అంశాలపై ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను అన్ని జిల్లాల వైద్యాధికారులకు, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండ్లకు పంపించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం మంకీపాక్స్ ఇప్పటికే 50 దేశాలకు విస్తరించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్ 22 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3,413 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. జంతువుల నుంచి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

  • Loading...

More Telugu News