Mexico: మెక్సికోలో కూలిన బ్లాక్ హాక్ చాపర్.. 14 మంది మృతి.. కరుడుగట్టిన డ్రగ్ డాన్ అరెస్ట్

14 dead in Black Hawk chopper crash in Mexico after drug lords arrest

  • హెలికాప్టర్ ఎందుకు కూలిందన్న దానిపై దర్యాప్తు
  • చాపర్ కూలిన ఘటనతో డ్రగ్ స్మగ్లర్ కి సంబంధం ఉందా? అన్నది తెలియాలి  
  • రాఫెల్ అరెస్ట్‌పై మెక్సికోను ప్రశంసించిన అమెరికా
  • ఆలస్యం చేయకుండా తమకు అప్పగించాలని కోరిన వైనం

మెక్సికోలోని సినాలోవాలో బ్లాక్ హాక్ మిలటరీ హెలికాప్టర్ కూలిన ఘటనలో 14 మంది మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. హెలికాప్టర్ ఎందుకు కూలిందన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. అదే సమయంలో కరుడుగట్టిన డ్రగ్ స్మగ్లర్ రాఫెల్ కారో క్వింటరోను నేవీ అరెస్ట్ చేసింది. 

అయితే, చాపర్ కూలిన ఘటనతో అతడికేమైనా సంబంధం ఉందా? అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. 1985లో యూఎస్ యాంటీ నార్కోటిక్స్ ఏజెంట్‌ను చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన కేసులో రాఫెల్ దోషి అని నేవీ తెలిపింది. దేశంలోని మాదక ద్రవ్యాల రవాణా కేంద్రాలలో ఒకటైన వాయవ్య రాష్ట్రమైన సినాలోవాలోని చోయిక్స్ మునిసిపాలిటీలో రాఫెల్ పట్టుబడ్డాడని పేర్కొంది. 

1980లలో లాటిన్ అమెరికాలో అత్యంత శక్తిమంతమైన మాదకద్రవ్యాల అక్రమ రవాణా సంస్థలలో ఒకటైన గ్వాడలజారా కార్టెల్ వ్యవస్థాపకుల్లో రాఫెల్ ఒకడు. మెక్సికన్ నేవీ అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిన వెంటనే అమెరికా స్పందించింది. అతడిని పట్టుకున్న అధికారులను ప్రశంసించింది. ఇది చాలా పెద్ద ఘనత అని, ఆలస్యం చేయకుండా అతనిని తమకు అప్పగించాలని కోరింది.

  • Loading...

More Telugu News