KCR: గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్న కేసీఆర్
- గోదావరి వరద నీటితో జలమయమైన వందలాది గ్రామాలు
- సీఎస్ సోమేష్ కుమార్ తో కలిసి ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే
- కడెం నుంచి భద్రాచలం వరకు ఏరియల్ సర్వే
భారీ వర్షాలతో గోదావరి పోటెత్తిన సంగతి తెలిసిందే. వరద నీటితో వందలాది గ్రామాలను గోదావరి ముంచెత్తింది. గోదావరి వరదల కారణంగా అపారమైన నష్టం వాటిల్లింది. వరద ఇంకా తగ్గకపోవడంతో ఎంత నష్టం జరిగిందనే విషయాన్ని ఇంకా కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు.
మరోవైపు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో కలిసి వరద బీభత్సాన్ని పరిశీలించనున్నారు. కడెం నుంచి భద్రాచలం వరకు వీరిద్దరూ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించబోతున్నారు.