Income Tax: ఇలా చేస్తే.. రూ.10.5 లక్షల ఆదాయం వచ్చినా రూపాయి పన్ను పడదు!

tax will not have to be paid on the earning of 10 lakhs this is the formula

  • చట్ట ప్రకారం ఎన్నో రాయితీలు, మినహాయింపులు
  • వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే పన్ను చెల్లించక్కర్లేదు
  • నూతన విధానంలో ఈ మినహాయింపులకు చోటు లేదు

వార్షికంగా రూ.5.5 లక్షలకు మించి ఆదాయం వుంటే కనుక సాధారణంగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. రూ.2.5 లక్షల వరకు అసలు పన్ను ఉండదు. ఆ తదుపరి 2.5 లక్షలపై 5 శాతం పన్ను రూ.12,500 చెల్లించాలి. కానీ, సెక్షన్ 87ఏ కింద దీనికి రిబేట్ ఉంటుంది. దీనికి తోడు స్టాండర్డ్ డిడక్షన్ కింద అందరికీ రూ.50వేల మినహాయింపు ఉంటుంది. కనుక ఎవరైనా కానీ, వారి ఆదాయం ఏడాదికి రూ.5.5 లక్షలకు మించి లేకపోతే పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. 

కానీ, రూ.5.5 లక్షలకు పైన ఆదాయం కలిగిన వారు గణనీయ సంఖ్యలో ఉన్నారు. వీరంతా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొత్త పన్ను విధానం కాకుండా, పాత పన్ను విధానంలోనే కొనసాగితే ఎన్నో పన్ను ఆదా మార్గాలు చట్ట పరంగా ఉన్నాయి. వీటిని పూర్తిగా ఉపయోగించుకుంటే రూ.10.25 లక్షలు ఉన్నప్పటికీ రూపాయి పన్ను కట్టక్కర్లేదు.

ప్రస్తుతం పాత పన్ను విధానం కింద రూ.5-10 లక్షల మధ్య ఆదాయం వుంటే 20 శాతం, రూ.10-12.5 లక్షల మధ్య ఉంటే 30 శాతం, రూ.12.5 లక్షలకు పైన వుంటే కనుక 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకుంటే మాత్రం.. చాలా వరకు పన్ను మినహాయింపులను కోల్పోవాల్సి వస్తుంది. 

కొత్త పన్ను విధానంలో రూ.2.5-5 లక్షల ఆదాయంపై 5 శాతం, రూ.5-7.5 లక్షల ఆదాయంపై 10 శాతం, రూ.7.5-10 లక్షల ఆదాయంపై 15 శాతం, రూ.10-12.5 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.12.5-15 లక్షల ఆదాయంపై 25 శాతం, ఆపైన ఉంటే 30 శాతం పన్ను రేటు అమలవుతుంది.

  • పాత పన్ను విధానంలో ఉంటే సెక్షన్ 80సీ కింద వివిధ సాధనాల్లో ఏడాదికి రూ.1.5 లక్షలు ఆదా చేసుకోవాలి. దీంతో ఈ మొత్తం కలిపి రూ.7 లక్షల ఆదాయంపై పన్ను పడదు. 
  • గృహ రుణం తీసుకుని దానికి చెల్లించే వడ్డీని రూ.2 లక్షలు పన్ను మినహాయింపు కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. దీంతో 9 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేకుండా పోతుంది. 
  • గృహ రుణం అసలుకు చేసే చెల్లింపులను సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పరిమితి కింద చూపించుకోవచ్చు.
  • ఇక పింఛను పథకమైన ఎన్ పీఎస్ లో ఏటా రూ.50వేలు ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనికి సెక్షన్ 24బీ కింద పన్ను మినహాయింపు ఉంది. దీంతో మొత్తం మినహాయింపు రూ.9.5 లక్షలకు చేరింది.
  • సెక్షన్ 80డీ కింద హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ చెకప్ లకు చేసే ఖర్చును చూపించుకోవచ్చు. 60 ఏళ్ల లోపు వారికి రూ.25వేల వరకు మినహాయింపు ఉంది. 60 ఏళ్లు పైబడిన వారు ఉంటే రూ.50 వేల రాయితీ పొందొచ్చు. రెండు విభాగాలు కలిపి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.75 వేల మొత్తంపై పన్ను పడదు. దీంతో మొత్తం పన్ను ఆదా ఆదాయం 10.25 లక్షలు చేరుకుంది.

  • Loading...

More Telugu News