Pappu Studios: పప్పు స్టూడియోను ప్రారంభించిన చిరంజీవి, నితిన్.. ఫొటోలు ఇవిగో!

Chiranjeevi and nithiin inaugurated the New Dubbing Studio Pappu Studios
  • జూబ్లీ హిల్స్ లో పప్పు స్టూడియో ప్రారంభం
  • పప్పు తన సొంత స్టూడియోను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్న చిరంజీవి
  • 25 ఏళ్లుగా తనకు పప్పు తెలుసన్న మెగాస్టార్
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో పప్పు స్టూడియోను మెగాస్టార్ చిరంజీవి, యంగ్ హీరో నితిన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి భార్య సురేఖ, ప్రకాశ్ రాజ్, దిల్ రాజు, టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ పప్పు తన సొంత డబ్బింగ్ థియేటర్ ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. 

పప్పు వండర్ ఫుల్ టెక్నీషియన్ అని కితాబిచ్చారు. గత 25 ఏళ్లుగా తనకు పప్పు తెలుసని అన్నారు. అందరు ఆర్టిస్టులతో బాగా కలిసిపోతారని చెప్పారు. ఇకపై తమ సినిమాలకు పప్పు స్టూడియోలోనే డబ్బింగ్ చేయిస్తామని తెలిపారు. తానే కాకుండా ఇండస్ట్రీలోని 80 శాతం మంది ఆర్టిస్టులు పప్పుని ప్రిఫర్ చేస్తారని చెప్పారు.
Pappu Studios
Dubbing Studio
Tollywood
Chiranjeevi
Nithin

More Telugu News