YSRCP: కుప్పం లో టీడీపీకి ఝలక్: పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

244 tdp leaders joindef in to ysrcp in kuppam
  • 244 మంది టీడీపీని వీడి వైసీపీలో చేరార‌న్న మంత్రి
  • వారం క్రిత‌మే వంద మంది టీడీపీని వీడార‌ని వెల్ల‌డి
  • కుప్పంలో వైసీపీ మ‌రింత బ‌లోపేత‌మైంద‌న్న పెద్దిరెడ్డి
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో శ‌నివారం ఆ పార్టీకి చెందిన 244 మంది వైసీపీలో చేరారు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స‌మ‌క్షంలో ఈ చేరిక‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ కుప్పంలో టీడీపీకి ‌ఝల‌క్ త‌గిలింద‌ని వ్యాఖ్యానించారు. టీడీపీ నుంచి భారీగా వైసీపీలోకి చేరిక‌లు జ‌రిగాయని ఆయ‌న తెలిపారు.

వారం ముందు టీడీపీకి చెందిన 100 మంది నేత‌లు వైసీపీలో చేరార‌ని పెద్దిరెడ్డి చెప్పారు. తాజాగా మ‌రో 244 మంది టీడీపీని వీడి వైసీపీలోకి చేరార‌ని ఆయ‌న తెలిపారు. ఫ‌లితంగా కుప్పంలో వైసీపీ మ‌రింత బ‌లోపేతం అయింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప‌థ‌కాలు అనేక మందిని వైసీపీ వైపు ఆక‌ర్షితుల‌ను చేస్తున్నాయ‌ని మంత్రి తెలిపారు.
YSRCP
YS Jagan
Andhra Pradesh
Kuppan]
TDP
Chandrababu
Peddireddi Ramachandra Reddy

More Telugu News