Arvind Kejriwal: ప్రధాని మోదీ 'ఉచిత' వ్యాఖ్యలపై దీటుగా బదులిచ్చిన అరవింద్ కేజ్రీవాల్

Kejriwal replies to Modi freebies comments
  • ఉచిత హామీలు దేశ ప్రగతికి ప్రమాదకరమన్న మోదీ
  • ఉచిత విద్య, వైద్యం తాయిలాలు కాదన్న కేజ్రీవాల్
  • తాము నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వెల్లడి
  • ఇదేమైనా నేరమా? అంటూ ప్రశ్నించిన ఢిల్లీ సీఎం  
ఓట్ల కోసం ఉచిత హామీలు ఇస్తున్నారని, ప్రజలను తాయిలాలతో మభ్యపెడుతున్నారని, ఇది ప్రమాదకరమైన సంస్కృతి అంటూ ఇతర పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేయడం తెలిసిందే. దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. విద్యార్థులకు ఉచిత విద్య, ప్రజలకు ఉచిత వైద్య సదుపాయం కల్పించడం తాయిలాలు ఇవ్వడం కాదని స్పష్టం చేశారు. 

"నన్ను ఉద్దేశించి ఈ ఆరోపణలు చేశారని నాకు తెలుసు. కానీ నేను చేసిన తప్పేంటి అని అడుగుతున్నాను. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి మేం నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నాం. విద్యార్థులకు ఎలాంటి ఖర్చులేని, మంచి విద్యను అందించడం నేరమా?" అని ప్రశ్నించారు. "ఇదంతా 1947, 1950లోనే చేయాల్సింది. మేం ఇప్పుడు దేశ భవిష్యత్తుకు పునాది వేస్తున్నాం. ఇది ఉచితంగా తాయిలాలు ఇస్తున్నట్టుకాదు" అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
Arvind Kejriwal
Narendra Modi
Freebies
AAP
BJP

More Telugu News