BJP: ధ‌న్‌ఖడ్ కు ముందస్తు అభినందనలు తెలిపిన అమిత్ షా

amit shah wished Jagdeep Dhankhar in advance
  • ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ధ‌న్‌ఖడ్ 
  • ఎన్డీఏ ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ధ‌న్‌ఖడ్ ఎంపిక‌
  • అమిత్ షాతో భేటీ అయిన ధ‌న్‌ఖడ్
ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో అధికార ఎన్డీఏ అభ్య‌ర్థిగా ఎంపికైన ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్‌ఖడ్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముందస్తు అభినంద‌న‌లు తెలిపారు. శ‌ని‌వారం సాయంత్రం సుదీర్ఘంగా జ‌రిగిన బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ భేటీలో ప‌లువురు నేత‌ల పేర్ల‌ను ప‌రిశీలించిన మీద‌ట జ‌గ‌దీప్ ధ‌న్‌ఖడ్ ను ఎన్డీఏ ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా బీజేపీ ఎంపిక చేసిన విషయం విదితమే. 

ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డినంత‌నే అమిత్ షా ఇంటికి జ‌గ‌దీప్ ధ‌న్‌ఖడ్ వెళ్లారు. ధ‌న్‌ఖడ్ ను సాద‌రంగా ఆహ్వానించిన అమిత్ షా... ఆయ‌న‌తో భేటీ అయ్యారు. అనంత‌రం ధ‌న్‌ఖడ్ విజయం ఖాయ‌మేనంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా అమిత్ షా ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ఉప‌రాష్ట్రప‌తిగా ధ‌న్‌ఖడ్ ఎన్నిక‌తో పార్ల‌మెంటులో ఎగువ స‌భ ఔన్న‌త్యం మ‌రింత పెరుగుతుంద‌ని తెలిపారు. ఫ‌లితంగా దేశానికి మేలు జ‌రుగుతుంద‌ని కూడా అమిత్ షా పేర్కొన్నారు.
BJP
Amit Shah
Jagdeep Dhankhar
Vice President
West Bengal
Governor

More Telugu News