Arvind Kejriwal: మోదీజీ.. మీరు చేస్తున్నది సరికాదు.. దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లేకుండా చేయొద్దు: కేజ్రీవాల్​

Arvind kejriwal writes to pm Modi protests delay in clearance for singapore summit

  • సింగపూర్ లో జరగబోయే ‘వరల్డ్ సిటీస్ సదస్సు’కు వెళ్లేందుకు అనుమతి ఇంకా ఇవ్వకపోవడంపై ఫైర్
  • ఉన్నత వేదికలపై భారత్ కు ప్రాతినిధ్యం వహించే అవకాశం లేకుండా చేయడం సమంజసం కాదని వ్యాఖ్య
  • ఇప్పటికైనా అనుమతి ఇవ్వాలంటూ ప్రధాన మంత్రికి లేఖ

త్వరలో సింగపూర్ లో జరగనున్న ‘ప్రపంచ నగరాల సదస్సు (వరల్డ్ సిటీస్ సమ్మిట్)’కు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వకపోవడంపై ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ నిరసన వ్యక్తం చేశారు. ఉన్నత వేదికలపై భారత్ కు ప్రాతినిధ్యం వహించే అవకాశం లేకుండా చేయడం సరికాదంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఆదివారం లేఖ రాశారు. వాస్తవానికి సింగపూర్ లో జరిగే సదస్సుకు హాజరుకావాల్సిందిగా నిర్వాహకుల నుంచి కేజ్రీవాల్ కు గతంలోనే ఆహ్వానం లభించింది. దీనికి అధికారికంగా హాజరయ్యేందుకు కేజ్రీవాల్ అనుమతి కోరినా.. ఇప్పటికీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీనిపై కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశం ఘనతను చాటుతా..
“ప్రపంచ స్థాయి సదస్సులో ఢిల్లీ మోడల్ ను ప్రదర్శించేందుకు రావాల్సిందిగా సింగపూర్ ప్రభుత్వం మమ్మల్ని ఆహ్వానించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద నాయకుల ఎదుట ఢిల్లీ మోడల్ ను ప్రదర్శిస్తాం. ఢిల్లీ మోడల్ గురించి మొత్తం ప్రపంచం తెలుసుకోవాలని భావిస్తోంది.. ఇది గొప్ప అవకాశం. వీలైనంత త్వరగా అనుమతి ఇస్తే.. ప్రపంచ వేదికపై మన దేశం ఘనతను చాటేందుకు కృషి చేస్తా..” అని అర్వింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
  • సదస్సుకు వెళ్లడానికి అనుమతి ఇవ్వకపోవడం పొరపాటు అని, ఉన్నత స్థాయి సమావేశాలకు వెళ్లకుండా ఓ ముఖ్యమంత్రిని ఆపడం దేశ ప్రయోజనాలకే విరుద్ధమని స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News