Uttam Kumar Reddy: అంతర్జాతీయ కుట్రలతో వర్షాలు, వరదలు వచ్చాయా?... కేసీఆర్ అర్థంలేకుండా మాట్లాడుతున్నారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar condemns KCR comments about cloud burst
  • తెలంగాణలో కుండపోత వానలు
  • గోదావరికి వరద
  • క్లౌడ్ బరస్ట్ జరిగి ఉంటుందన్న కేసీఆర్
  • దీని వెనుక కుట్ర ఉందంటూ అనుమానం
  • చిన్న ప్రాంతాల్లోనే క్లౌడ్ బరస్ట్ సాధ్యమన్న ఉత్తమ్
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదల వెనుక కుట్ర కోణం ఉండొచ్చని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. 'క్లౌడ్ బరస్ట్' వల్లే ఇంతటి భారీ వర్షపాతం నమోదై ఉండొచ్చని కేసీఆర్ సందేహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. 

"తెలంగాణలో వర్షాలు, వరదలకు అంతర్జాతీయ కుట్రలు కారణమా?... కేసీఆర్ అర్థంలేకుండా మాట్లాడుతున్నారు" అంటూ విమర్శించారు. క్లౌడ్ బరస్ట్ అనేది చిన్న ప్రాంతాల్లోనే వీలుపడుతుందని, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం సరికాదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోవడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ 'క్లౌడ్ బరస్ట్' అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
Uttam Kumar Reddy
CM KCR
Cloud Burst
Telangana

More Telugu News