Team India: మూడో వన్డేలో టీమిండియా లక్ష్యం 260 పరుగులు
- మాంచెస్టర్ లో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
- 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
- పాండ్యాకు 4 వికెట్లు, 3 వికెట్లు తీసిన చహల్
- 60 పరుగులతో బట్లర్ టాప్ స్కోరర్
ఇంగ్లండ్ తో చివరిదైన మూడో వన్డేలో టీమిండియా ముందు ఓ మోస్తరు లక్ష్యం నిలిచింది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా, ఆతిథ్య ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో విశేషంగా రాణించాడు. దాంతో, ఇంగ్లండ్ జట్టు 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ జోస్ బట్లర్ 60 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జాసన్ రాయ్ 41, మొయిన్ అలీ 34, క్రెగ్ ఓవర్టన్ 32, బెన్ స్టోక్స్ 27, లివింగ్ స్టోన్ 27 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో పాండ్యా 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, చహల్ 3, సిరాజ్ 2, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశారు. కాగా, జడేజా ఈ మ్యాచ్ లో కళ్లు చెదిరే రీతిలో ఫీల్డింగ్ చేయడమే కాకుండా, అద్భుతమైన క్యాచ్ లతో అలరించాడు.