Rani Agrawal: మధ్యప్రదేశ్ లోనూ కాలుమోపిన ఆమ్ ఆద్మీ పార్టీ... మేయర్ పీఠం కైవసం

AAP enters Madhya Pradesh by clinching Singrouli Mayor post
  • సింగ్రౌలీ మేయర్ గా రాణి అగర్వాల్
  • బీజేపీ అభ్యర్థిపై రాణి అగర్వాల్ విజయం
  • అభినందించిన కేజ్రీవాల్
  • తమవి నిజాయతీతో కూడిన రాజకీయాలని వెల్లడి
ఢిల్లీలోనే కాదు, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ విస్తరించాలన్న లక్ష్యంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్ లోనూ కాలుమోపింది. తాజాగా సింగ్రౌలీ నగర మేయర్ పీఠాన్ని ఆప్ కైవసం చేసుకుంది. స్థానిక ఎన్నికల్లో ఆప్ మేయర్ అభ్యర్థి రాణి అగర్వాల్ గెలుపొందారు. ఆమె బీజేపీ అభ్యర్థి చంద్రప్రతాప్ విశ్వకర్మపై 9,300 ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. 

కాగా, సింగ్రౌలీ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించిన తమ అభ్యర్థి రాణి అగర్వాల్ ను ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు. దేశవ్యాప్తంగా ప్రజలు నిజాయతీతో కూడిన తమ రాజకీయాలను అభినందిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రస్థానం మొదలుపెట్టిన ఆప్ పంజాబ్ లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
Rani Agrawal
Mayor
Singrouli
AAP
Arvind Kejriwal
Madhya Pradesh
Delhi

More Telugu News