Prakash Raj: మహేశ్ మూవీలో ఆ పాత్రను అయిష్టంగానే చేశాను: ప్రకాశ్ రాజ్

Prakashraj Interview
  • 'సరిలేరు నీకెవ్వరు'లో విలన్ పాత్ర పట్ల ప్రకాశ్ రాజ్ అసంతృప్తి
  • కొన్ని సార్లు అలాంటి పాత్రలు చేయవలసి వస్తుందంటూ వ్యాఖ్య 
  • 'మేజర్'లో పాత్ర సంతృప్తిని ఇచ్చిందంటూ వెల్లడి   
ప్రకాశ్ రాజ్ ..  పాత్రలో కొంచెం విషయం ఉంటే చాలు ఆయన దానిని తీసుకువెళ్లి ఎక్కడో కూర్చోబెడతారు. ఎలాంటి పాత్రలోనైనా ఆయన ఇమిడిపోయే తీరు ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాంటి ప్రకాశ్ రాజ్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. 

ఏ ఆర్టిస్టుకైనా ఒక్కోసారి నచ్చని పాత్రలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. అలాంటి పాత్రలలో ఒకటి 'సరిలేరును నీకెవ్వరు' సినిమాలో చేశాను. ఆ సినిమాలో అబద్ధాలాడే ఒక రాజకీయనాయకుడి పాత్రను అయిష్టంగానే చేశాను. కొన్ని సార్లు మన నిర్ణయాలతో .. అభిప్రాయాలతో పనిలేకుండా అలా జరిగిపోతుంటుంది. 

మహేశ్ బాబు హీరోగా చేసిన ఆ సినిమాలో నేను అలాంటి పాత్రను చేయడం అసంతృప్తిగా అనిపించినా, ఆయన నిర్మించిన 'మేజర్' సినిమాలోని పాత్ర నాకు సంతృప్తినిచ్చింది. నా కెరియర్లో 'ఆకాశమంత' .. 'బొమ్మరిల్లు' సినిమాలు నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి" అని చెప్పుకొచ్చారు.
Prakash Raj
Mahesh Babu
SarileruNeekevvaru

More Telugu News