Chandrababu: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు

TDP Chief Chandrababu casts his vote in presidential elections
  • నేడు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్
  • ఏపీ అసెంబ్లీలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు
  • టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి తరలివెళ్లిన చంద్రబాబు
  • ఇటీవల ముర్ముకు మద్దతు పలికిన టీడీపీ
దేశంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలోనూ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.  తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు. పార్టీ కార్యాలయం నుంచి టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన రాష్ట్ర అసెంబ్లీకి తరలి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ముర్ము ఇటీవల విజయవాడ వచ్చినప్పుడు ఆమెకు టీడీపీ ఘనస్వాగతం పలికింది.
Chandrababu
Vote
Presidential Elections
TDP
Droupadi Murmu
Andhra Pradesh

More Telugu News