Mangal Pandey: స్వాతంత్య్ర స‌మ‌రయోధుడు మంగ‌ళ్ పాండేకు మోదీ నివాళి... ఫొటో ఇదిగో

pm modi tributes to freedom fighter Mangal Pandey in meerut
  • స్వాతంత్య్ర  సంగ్రామంలో మంగ‌ళ్ పాండే కీల‌క భూమిక‌
  • నేడు మంగ‌ళ్ పాండే జ‌యంతి
  • మీర‌ట్‌లో ఆయ‌న విగ్ర‌హం ముందు నివాళి అర్పించిన మోదీ
  • మంగ‌ళ్ పాండే జీవితం ఆధారంగా ఆమిర్ ఖాన్ చిత్రం
భార‌త స్వతంత్ర సంగ్రామంలో ఎంద‌రో వీరులు ఆంగ్లేయుల పాల‌న‌కు వెన్నుచూప‌కుండా పోరాడారు. వారిలో మంగ‌ళ్ పాండే ఒక‌రు. బాలీవుడ్ మిస్ట‌ర్ ఫెర్‌ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్ మంగ‌ళ్ పాండే పేరిట ఓ సినిమాను తీసిన సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం మంగ‌ళ్ పాండే జయంతిని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆ వీరుడికి నివాళి అర్పించారు.

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌లో మంగ‌ళ్ పాండేకు చెందిన నిలువెత్తు విగ్ర‌హాన్ని గ‌తంలోనే ఏర్పాటు చేశారు. ఈ విగ్ర‌హం వ‌ద్ద‌కు మంగ‌ళ‌వారం వెళ్లిన మోదీ... స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడికి నివాళి అర్పించారు. ఈ ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన మోదీ... మంగ‌ళ్ పాండే వీర‌త్వాన్ని కీర్తించారు. ఓ సంక‌ల్పంతో ధైర్యంగా ముందుకు సాగిన మంగ‌ళ్ పాండే వేలాది మంది భార‌తీయుల్లో పోరాట ప‌టిమ‌ను ర‌గిల్చార‌ని ఆయ‌న‌ను మోదీ కీర్తించారు.
Mangal Pandey
Prime Minister
Narendra Modi
Freedom Fight
Meerut
Aamir Khan
Bollywood Movie

More Telugu News