Rishi Sunak: బ్రిటన్ ప్రధాని పదవికి పోరులో రిషి సునాక్ జోరు

Rishi Sunak gains majority in every round

  • కన్జర్వేటివ్ పార్టీ అధినేత పదవికి ఓటింగ్
  • నాలుగు రౌండ్లలో రిషి సునాక్ దే ఆధిపత్యం
  • 59 ఓట్లతో రేసు నుంచి వైదొలగిన కెమి బడెనోవిచ్
  • రేసులో రిషి సునాక్, పెన్నీ మోర్టాంట్, లిజ్ ట్రూజ్

భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని పదవికి జరుగుతున్న పోరులో మరింత ముందంజ వేశారు. కన్జర్వేటివ్ పార్టీ అధినేత పదవి కోసం ఇప్పటివరకు నాలుగు రౌండ్ల పోరు జరగ్గా, ప్రతి రౌండ్ లోనూ రిషి స్పష్టమైన అధిక్యం సాధించారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా ఎన్నికైన వ్యక్తి ప్రధాని పీఠాన్ని అధిష్టిస్తారు. ఈ నేపథ్యంలో, రిషి సునాక్ తన అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంటున్నారు. 

కేవలం 59 ఓట్లు సాధించిన కెమి బడెనోవిచ్ రేసు నుంచి తప్పుకోవడంతో ప్రధాని పదవి కోసం బరిలో ముగ్గురే మిగిలారు. ఆ ముగ్గురిలో రిషి సునాక్ అగ్రస్థానంలో ఉండడం విశేషం. ఆ మిగతా ఇద్దరు ఎవరంటే... వాణిజ్య మంత్రి పెన్నీ మోర్టాంట్, విదేశాంగ మంత్రి లిజ్ ట్రూజ్. 

ఇవాళ నిర్వహించిన తాజా రౌండ్ ఓటింగ్ లో రిషి సునాక్ 118 ఓట్లు రాబట్టగా, రెండో స్థానంలో ఉన్న పెన్నీ మోర్టాంట్ 92 ఓట్లు, మూడో స్థానంలో ఉన్న లిజ్ ట్రూజ్ 86 ఓట్లు దక్కించుకున్నారు. కాగా, 'రెడీ ఫర్ రిషి' అంటూ రిషి ప్రచారంలో దూసుకెళుతున్నారు. ప్రత్యేకంగా వెబ్ సైట్ ఏర్పాటు చేసి మరీ తన ఆలోచనలను పంచుకుంటున్నారు.

  • Loading...

More Telugu News