APSRTC: దూర ప్రాంతాలకు ఏపీఎస్ ఆర్టీసీ నాన్ ఏసీ స్లీపర్ బస్సులు.. పేరు పెడితే బహుమతి మీకే!
- ఒక్కో బస్సులో 30 బెర్తులు.. ప్రతి బెర్త్‌కు ఫ్యాన్
- బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా పేరు సూచించాలన్న ఆర్టీసీ
- పేరు పెట్టి క్యాష్‌ప్రైజ్ సొంతం చేసుకోవాలన్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు
ఏపీఎస్ ఆర్టీసీ త్వరలోనే దూర ప్రాంత ప్రయాణికుల కోసం కొత్తగా నాన్ ఎసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెడుతోంది. ఒక్కో బస్సులో 30 బెర్తులు, ప్రతి బెర్త్‌కు ఫ్యాన్, రీడింగ్ ల్యాంప్ ఉంటాయి. ఈ బస్సులకు మంచి పేరు పెట్టాలని ఆర్టీసీ కోరుతోంది. బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా పేరు సూచించిన వారికి బహుమతి అందిస్తామని ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
ఈ నెల 24 లోగా మంచి పేరు సూచించిన ఉద్యోగులకు అవార్డు, ప్రజలకు నగదు రివార్డు ఇస్తామన్నారు. మరెందుకాలస్యం.. మంచి పేరు ఆలోచించండి.. క్యాష్ ప్రైజ్ గెలుచుకోండి. మీరు సూచించే పేరును [email protected]కు పంపించాల్సి ఉంటుంది.