Netflix: నెట్ ఫ్లిక్స్ నచ్చడం లేదా..? మరో 10 లక్షల మంది బయటకు!

Netflix subscriber base continues to shrink lost nearly 1 million members last quarter

  • ఏప్రిల్-జూన్ మధ్య 9,70,000 మందిని నష్టపోయిన సంస్థ
  • జనవరి-మార్చి కాలంలోనూ 2,00,000 మంది కస్టమర్లు బయటకు
  • ప్రస్తుత త్రైమాసికంపై సంస్థ ఆశావహ అంచనాలు

ఓటీటీ ప్రపంచంలో వినోదపు రారాజు నెట్ ఫ్లిక్స్.. యూజర్లకు బోర్ కొట్టేస్తోందా..? యూజర్లు క్రమంగా వెళ్లిపోతుండడం ఈ సందేహానికే తావిస్తోంది. 2022 ఏప్రిల్-జూన్ గణాంకాలను నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. 9,70,000 మంది యూజర్లను సంస్థ కోల్పోయింది. 2022 జనవరి-మార్చి త్రైమాసికంలోనూ ఈ సంస్థ 2,00,000 మంది యూజర్లను నష్టపోయింది. సంస్థ చరిత్రలో వరుసగా రెండు త్రైమాసికాల్లో యూజర్లను కోల్పోవడం ఇదే మొదటిసారి.

అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ కు 22 కోట్ల యూజర్లు ఉన్నారు. జులై-సెప్టెంబర్ కాలంలో 10 లక్షల మంది కొత్త యూజర్లను సంపాదిస్తామని సంస్థ ధీమాగా చెప్పింది. ఎంతో ప్రాచుర్యం పొందిన ఇంగ్లిష్ లాంగ్వేజ్ షో ‘స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4’కు సంబంధించి వ్యాల్యూమ్ 1, 2లను విడుదల చేసింది. మరెన్నో పాప్యులర్ షోలను కూడా తన ప్లాట్ ఫామ్ పైకి తీసుకొచ్చింది. దీంతో కొత్త యూజర్లను సంపాదించగలమని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చౌక ప్లాన్లతో యూజర్లను చేరుకోవాలని నెట్ ఫ్లిక్స్ యోచిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.

  • Loading...

More Telugu News