Ben Stokes: టీ20ల నుంచి బెన్ స్టోక్స్ నిష్క్రమణ తప్పదా..?

I retired from ODIs and ECB banned me from T20Is too

  • వన్డేల నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ క్రికెటర్
  • తాను అలా చేయడం వల్లే టీ20ల్లో చోటు కోల్పోయానన్న పీటర్సన్
  • రెండు ఫార్మాట్లకూ ఒకటే ఎంపిక విధానం ప్రస్తావన

మూడు ఫార్మాట్లలో (వన్డే, టెస్ట్ లు, టీ20లు) ఆడే తీరిక లేకపోవడంతో ఇంగ్లండ్ టాప్ క్రికెటర్ బెన్ స్టోక్స్.. మంగళవారంతో వన్డేల నుంచి స్వచ్ఛంద విరమణ తీసుకున్నాడు. మూడు ఫార్మాట్లలో ఆడడం తనకు సాధ్యపడడం లేదని స్టోక్స్ ప్రకటించాడు. తీరిక లేని షెడ్యూల్ తన ఫిట్ నెస్ ను దెబ్బతీస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి రద్దీతో కూడిన షెడ్యూళ్లే కారణమన్న వాదన తెరపైకి వచ్చింది. 

స్టోక్స్ స్వచ్చంద విరమణ ప్రకటన తర్వాత.. అత్యంత రద్దీతో కూడిన అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూళ్లు, ఆదరణ కోల్పోతున్న వన్డేలపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. వన్డేల స్థానంలో టీ20లకు ప్రాధాన్యం, ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఓ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాడు. 

‘‘షెడ్యూల్ భయంకరంగా ఉందని ఓ సందర్భంలో నేను చెప్పాను. అది భరించలేకే వన్డేల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాను. దాంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) టీ20ల నుంచి నన్ను బ్యాన్ చేసింది’’ అని పీటర్సన్ ట్విట్టర్లో తన స్పందన వ్యక్తం చేశాడు.

టీ20 ప్రపంచకప్ కు జాతీయ జట్టు తరఫున ఆడేందుకు తాను సిద్ధంగానే ఉన్నప్పటికీ, ఈసీబీ ఎంపిక విధానం అంతిమంగా తనను అడ్డుకున్నట్టు చెప్పాడు. ‘‘కార్యక్రమం, ప్రణాళికలు అన్నవి టీ20, వన్డే ఫార్మాట్లకు చాలా సన్నిహితంగా ఉంటాయి. మాకొక ఎంపిక విధానం ఉంది. ఏ ఆటగాడు అయినా వన్డే లేదా టీ20కి అందుబాటులో లేకపోతే.. రెండు ఫార్మాట్లకు అందుబాటులో లేనట్టుగా పరిగణిస్తారు’’ అని ఈసీబీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ హగ్ మారిస్ సైతం తెలిపాడు. దీన్ని బట్టి చూస్తుంటే బెన్ స్టోక్స్ ను టీ20లకు పరిగణనలోకి తీసుకోవడం సందేహమేనని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News