ICC: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఎగ‌బాకిన పాండ్యా... దిగ‌జారిన కోహ్లీ, రోహిత్‌, బుమ్రా

hardik pandya top ten all ronders list and stood at 8th rank
  • ఏకంగా 13 స్థానాలు ఎగ‌బాకిన హార్దిక్‌
  • ఆల్ రౌండ‌ర్ల జాబితాలో 8వ ర్యాంకులో నిలిచిన వైనం
  • నాలుగో స్థానానికి ప‌డిపోయిన కోహ్లీ
  • ఐదో స్థానానికి దిగ‌జారిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌
  • బౌలర్ల‌లో టాప్ పొజిష‌న్ కోల్పోయిన బుమ్రా
ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధ‌వారం విడుద‌ల చేసిన వ‌న్డే ర్యాంకింగ్స్‌లో భార‌త ఆట‌గాళ్ల‌లో ఒక్క‌రు మాత్ర‌మే కాస్తంత ప్ర‌తిభ క‌న‌బర‌చ‌గా... ముగ్గురు స్టార్ క్రికెట‌ర్లు త‌మ ర్యాంకుల‌ను మ‌రింత దిగ‌జార్చుకున్నారు. వ‌న్డే ఆల్ రౌండ‌ర్ల జాబితాలో టాప్ టెన్ ర్యాంకుల్లోకి వ‌చ్చేసిన టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ హార్దిక్ పాండ్యా ఏకంగా 13 స్థానాలు ఎగ‌బాకి 8వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్ రౌండర్ల జాబితాలో పాండ్యా మిన‌హా మ‌రే ఇత‌ర భార‌త క్రికెటర్‌కు చోటు ద‌క్క‌లేదు.

ఇక ఐసీసీ వ‌న్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగ‌జారాడు. నిన్న‌టిదాకా మూడో స్థానంలో ఉన్న కోహ్లీ... తాజాగా నాలుగో స్థానానికి ప‌డిపోయాడు. ఇక కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కూడా నాలుగో స్థానం నుంచి ఐదో స్థానానికి దిగ‌జారాడు. ఇటీవ‌లే ఇంగ్లండ్ జ‌ట్టుపై తొలి వ‌న్డేలో ఏకంగా 6 వికెట్లు తీసిన టీమిండియా బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా... వ‌న్డే బౌల‌ర్ల ర్యాంకుల్లో టాప్‌కు చేరిన సంగ‌తి తెలిసిందే. అయితే వారం తిర‌క్కుండానే బుమ్రా త‌న టాప్ ప్లేస్‌ను కోల్పోయాడు. న్యూజిల్యాండ్ బౌల‌ర్ ట్రెంట్ బౌల్ట్ టాప్‌లోకి ఎగ‌బాక‌గా... బుమ్రా రెండో స్థానంలో ఉన్నాడు.
ICC
ODI Rankings
Cricket
Rohit Sharma
Virat Kohli
Hardik Pandya
Jaspreet Bumra
Team India

More Telugu News