Revanth Reddy: నాడు మోదీని పొగిడిన కేసీఆర్ నేడు నాలుక మడతేశారు: రేవంత్ రెడ్డి
- జీఎస్టీకి మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేశారన్న రేవంత్
- జీఎస్టీకి నాడు ఎందుకు మద్ధతిచ్చారని నిలదీత
- పాలు, పెరుగుపై పన్ను వేస్తుంటే జీఎస్టీ మండలిలో రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పిందా? అంటూ ప్రశ్న
జీఎస్టీ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జీఎస్టీకి మద్దతుగా గతంలో అసెంబ్లీలో తీర్మానం చేశారని... ఆ సందర్భంలో మోదీని కేసీఆర్ పొగిడారని అన్నారు. ఆరోజు మోదీని పొగిడిన కేసీఆర్... ఈరోజు నాలుక మడతేశారని విమర్శించారు. జీఎస్టీకి నాడు ఎందుకు మద్దతిచ్చారు? నేడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అని ప్రశ్నించారు. పాలు, పెరుగుపై పన్ను వేస్తుంటే జీఎస్టీ మండలిలో రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పిందా? అని అడిగారు. ఈ ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు.