Enforcement Directorate: ఈ నెల 27న విచార‌ణ‌కు రండి.. సంజ‌య్ రౌత్‌కు ఈడీ తాజా స‌మ‌న్లు

ed issues fresjh summons to shivsena mp sanjay raut
  • మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో రౌత్‌కు స‌మ‌న్లు
  • ఇప్ప‌టికే రెండు సార్లు స‌మ‌న్లు జారీ చేసిన ఈడీ
  • అయినా విచార‌ణ‌కు హాజ‌రు కాని శివ‌సేన ఎంపీ
శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) బుధ‌వారం మ‌రోమారు స‌మ‌న్లు జారీ చేసింది. మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ ఇదివ‌ర‌కే రెండు సార్లు రౌత్‌కు ఈడీ స‌మ‌న్లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ప‌లు కార‌ణాల‌తో ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌రు కాలేదు. మంగ‌ళ‌వారం కూడా మ‌రోమారు స‌మ‌న్లు జారీ చేసిన ఈడీ... అదే రోజు విచార‌ణ‌కు రావాలంటూ రౌత్‌ను కోరింది. అయితే మంగ‌ళ‌వారం కూడా ఆయ‌న ఈడీ విచార‌ణ‌కు హాజ‌రు కాలేదు.

ఈ నేప‌థ్యంలో తాజాగా బుధ‌వారం ఈడీ అధికారులు సంజ‌య్ రౌత్‌కు స‌మ‌న్లు జారీ చేశారు. ఈ నెల 27న ముంబైలోని త‌మ కార్యాల‌యంలో విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ స‌ద‌రు స‌మ‌న్ల‌లో ఈడీ అధికారులు శివ‌సేన ఎంపీకి ఆదేశాలు జారీ చేశారు.  
Enforcement Directorate
Maharashtra
Shiv Sena
Sanjay Raut

More Telugu News