Andhra Pradesh: నాకు సాంకేతిక అంశాలు తెలియకున్నా.. కామన్ సెన్స్ ఉంది!: ఏపీ మంత్రి అంబటి రాంబాబు

Although I dont know the technical aspects I have common sense says Ambati Rambabu

  • గోదావరి వరదలు, పోలవరం ప్రాజెక్టు అంశాలపై మాట్లాడిన మంత్రి అంబటి 
  • మంత్రులకు సాంకేతిక అంశాలు తెలియాల్సిన అవసరం లేదని వ్యాఖ్య  
  • ఆరోగ్యశాఖ మంత్రులు ఆసుపత్రుల్లో ఆపరేషన్లు చేస్తారా? అని ప్రశ్న

పోలవరం ప్రాజెక్టు ఎత్తుతో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఈ ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను ఆర్డినెన్స్‌ ద్వారా ఏపీలో కలిపిన తెలంగాణ నేతలు గుర్తించాలని చెప్పారు. మంత్రిగా సాంకేతిక అంశాలన్నీ తెలియాల్సిన అవసరం లేదని.. తనకు సాంకేతిక అంశాలు తెలియకున్నా కనీస కామన్ సెన్స్ ఉందని వ్యాఖ్యానించారు. దేశంలో ఆరోగ్య శాఖల మంత్రులు ఆసుపత్రుల్లో ఆపరేషన్లు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. గోదావరికి అంత భారీగా వరదలు వచ్చినా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూశామని.. ముంపు బాధిత కుటుంబాలకు రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశామని తెలిపారు.
 
టీడీపీ హయాంలోనే పోలవరం జాప్యం
పోలవరం ప్రాజెక్టు జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని.. ప్రాజెక్టు చేపట్టినప్పుడు ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అంబటి రాంబాబు అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాకే పోలవరం స్పిల్ వే, అప్రోచ్ చానళ్లను పూర్తి చేశామని వివరించారు. పోలవరం ప్రాజెక్టు కొత్త డీపీఆర్‌ అంశం ఇంకా కేంద్రం పరిధిలోనే ఉందన్నారు. కేంద్రం నుంచి ఏపీకి ఇంకా రూ.2,700 కోట్లు రావాల్సి ఉందని వివరించారు. 

  • Loading...

More Telugu News