Liquor Bar: ఏపీలో 840 బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ
- ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి 2025 ఆగస్టు 31 వరకు లైసెన్స్
- ఈ నెల 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో..
- విశాఖపట్టణంలో అత్యధికంగా 128 కొత్త బార్ల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 840 బార్లు ఏర్పాటు కానున్నాయి. ఈ-వేలం ద్వారా వీటిని వేలం వేయనున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ నిన్న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి 31 ఆగస్టు 2025 వరకు బార్లకు అనుమతినిస్తూ లైసెన్సులు మంజూరు చేస్తారు.
నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకుని ప్రాసెసింగ్ ఫీజుతోపాటు నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజును మాత్రం ఈ నెల 28వ తేదీ వరకు చెల్లించొచ్చు. దరఖాస్తులు సమర్పించేందుకు జోన్ల వారీగా తేదీలు నిర్ణయించారు. రాష్ట్రంలో అత్యధికంగా విశాఖపట్టణంలో 128 బార్లు కొత్తగా ఏర్పాటు కానుండగా, ఆ తర్వాతి స్థానంలో విజయవాడ (110), గుంటూరు (67), నెల్లూరు (35) ఉన్నాయి.