Amarnath Yatra: అమర్ నాథ్ యాత్రలో సరికొత్త రికార్డ్

In 22 days pilgrim numbers break last year 60 day long Amarnath Yatra record
  • 22 రోజుల్లో 2,94,040 మందికి దర్శనం
  • గతేడాది కంటే ఇది ఎక్కువ
  • ఆగస్ట్ 15 వరకు కొనసాగనున్న యాత్ర
ఈ ఏడాది అమర్ నాథ్ యాత్రలో మొదటి 22 రోజులకే రికార్డ్ నమోదైంది. 2,94,040 మంది హిమ శివలింగాన్ని దర్శించుకున్నారు. గతేడాది 60 రోజుల యాత్ర పొడవునా దర్శించుకున్న వారి సంఖ్య 2.85 లక్షల కంటే ఇది ఎక్కువ. అమర్ నాథ్ యాత్ర ఈ ఏడాది 46 రోజుల పాటు సాగనుంది. ఈ ఏడాది మొత్తం మీద దర్శించుకునేవారి సంఖ్య, ఇటీవలి సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటుందని అమర్ నాథ్ ష్రైన్ బోర్డ్ ప్రకటించింది. 

ఈ ఏడాది 26 రోజుల పాటు సాగే యాత్ర ఆగస్ట్ 15తో ముగియనుంది. 2015లో 3,52,771 మంది, 2016లో 3,20,490 మంది అమర్ నాథ్ గుహను దర్శించుకున్నారు. 2017లో అమర్ నాథ్ గుహను సందర్శించిన వారి సంఖ్య 2,60,003గా ఉంది. ఈ ఏడాది యాత్ర ముగిసే నాటికి సందర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా ఉండనుందని తెలుస్తోంది. 4,700 మందితో కూడిన తాజా బృందం భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి అమర్ నాథ్ గుహ దిశగా ప్రయాణమై వెళ్లింది.
Amarnath Yatra
piligrims
records

More Telugu News