Samantha: డబ్బు లేక పైచదువులకు వెళ్లలేకపోయాను: సమంత

Samantha makes interesting statements at Koffee With Karan
  • 'కాఫీ విత్ కరణ్' తో సమంత వ్యాఖ్యలు
  • ఇంట్లో ఇబ్బందులు ఉండేవని వెల్లడి
  • నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదని వివరణ
  • తండ్రి అప్పులు కట్టలేనన్నాడని వ్యాఖ్యలు
బాలీవుడ్ ఫిలింమేకర్ కరణ్ జొహార్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' టీవీ షోలో అందాల నటి సమంత ఆసక్తికర అంశాలను వెల్లడించింది. సినిమాల్లో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదని తెలిపింది. యాక్టింగ్ అనేది తన ప్రాధాన్యతా అంశాల్లో లేదని, ఇంటి వద్ద గడ్డు పరిస్థితుల కారణంగా నటన వైపు అడుగులు వేయాల్సి వచ్చిందని వివరించింది. 

అప్పట్లో డబ్బు లేకపోవడంతో పైచదువులకు వెళ్లాలన్న ఆలోచనను మానుకున్నానని సమంత వెల్లడించింది. "నీ అప్పులు నేను కట్టలేను అని మా నాన్న తెగేసి చెప్పడం నా జీవితాన్ని మార్చేసింది. ఓ కీలక నిర్ణయం తీసుకోవడానికి మా నాన్న మాటలు ఉపయోగడ్డాయి" అని వివరించింది.
Samantha
KWK
Karan Johar
Interview
Tollywood
Bollywood

More Telugu News