Prabhas: మారుతితో సినిమాకి రెడీ అవుతున్న ప్రభాస్!

Prabhas and Maruthi Movie Update
  • భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్
  • సింగిల్ లైన్ తో ఆయనను ఒప్పించిన మారుతి 
  • వచ్చేనెలలో షూటింగు మొదలు 
  • హారర్ కామెడీ నేపథ్యంలో సాగే 'రాజా డీలక్స్'
ప్రభాస్ ఈ మధ్య కాలంలో అన్నీ భారీ సినిమాలే చేస్తూ వస్తున్నాడు. వందల కోట్ల బడ్జెట్ .. వేల కోట్ల బిజినెస్ అన్నట్టుగా ఆయన సినిమాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను దర్శకుడు మారుతి ఒప్పించడం విశేషం. ప్రభాస్ తో కనుక మారుతి ఆ స్థాయిలోనే ఈ సినిమాను ప్లాన్ చేయలేదు.
 
బడ్జెట్ పరంగా మారుతి సినిమాల రేంజ్ లోనే ఈ ప్రాజెక్ట్ ఉండనుంది. అలాగే ఈ సినిమాను కూడా ఆయన డిజైన్ చేశాడు. ఈ కథ అంతా కూడా 'రాజా డీలక్స్' అనే ఒక సినిమా థియేటర్ చుట్టూ తిరుగుతుంది. హారర్ టచ్ తో సాగే మారుతి మార్క్ కామెడీ సినిమా ఇది. అలాగని చెప్పేసి ప్రభాస్ స్థాయిని తగ్గించే ఆలోచనగానీ .. అవకాశంగాని లేని సినిమా ఇది.

 కథ వినగానే ప్రభాస్ ఈ సినిమాను కూడా సాధ్యమైనంత త్వరగా కానిచ్చేద్దాం అనడానికి కారణం అందులోని కొత్తదనమే. వచ్చేనెలలో ఈ సినిమా షూటింగు మొదలవుతుందని అంటున్నారు. పదిరోజుల పాటు జరిగే ఫస్టు షెడ్యూల్లోనే ప్రభాస్ పాల్గొంటాడని అంటున్నారు. ఇటు 'సలార్' .. అటు' ప్రాజెక్టు K' పూర్తయ్యేలోగా 'రాజా డీలక్స్'ను కూడా పూర్తిచేసే ఆలోచనలో ఉన్నారని టాక్.
Prabhas
Maruthi
Tollywood

More Telugu News