Monkeypox Virus: వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్... ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ

WHO declares world health emergency on Monkeypox spreading
  • 70కి పైగా దేశాల్లో మంకీపాక్స్
  • యూరప్ లో మొదలైన వైరస్
  • ఆఫ్రికాలో ఐదుగురి మృతి
  • ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ
కరోనా మహమ్మారి బారినపడి విలవిల్లాడిన ప్రపంచదేశాలకు ఇప్పుడు మంకీపాక్స్ రూపంలో కొత్త ముప్పు తయారైంది. ఈ నేపథ్యంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అప్రమత్తమైంది. మంకీపాక్స్ వేగంగా విస్తరిస్తోందని, ఇప్పటికే 70కి పైగా దేశాల్లో మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. దాంతో, ప్రపంచ ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటిస్తున్నట్టు తెలిపింది. 

గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించడం ద్వారా గణనీయస్థాయిలో ప్రభావం కలిగించే ముప్పుగా మంకీపాక్స్ ను డబ్ల్యూహెచ్ఓ పరిగణిస్తుంది. తద్వారా అంతర్జాతీయ సమాజం నుంచి సహకారం కోరే వీలుంటుంది. యూరప్ దేశాలను ఈ కొత్త వైరస్ కు జన్మస్థానంగా భావిస్తున్నారు. స్వలింగ సంపర్కుల్లో ఇది అత్యంత ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. 

ఇప్పటిదాకా 75 దేశాల్లో 16 వేల మంకీపాక్స్ కేసులు వెల్లడయ్యాయి. జూన్ చివరి వారం నుంచి జులై మొదటివారం వరకు ఈ వైరస్ విస్తరణ వేగం 77 శాతానికి పెరిగింది. ఆఫ్రికాలో ఇప్పటివరకు ఐదు మరణాలు నమోదు కాగా, ఇతర ఖండాల్లో మంకీపాక్స్ కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు.
Monkeypox Virus
WHO
Global Health Emergency
Europe

More Telugu News