Raja Singh: కేరళలో సిమి ఆర్గనైజేషన్ ను నిషేధిస్తే... నిజామాబాద్ లో ఇప్పుడు పీఎఫ్ఐ పేరుతో వెలిసింది: రాజా సింగ్
- రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయన్న రాజాసింగ్
- ప్రభుత్వ నిఘా వైఫల్యం ఉందని విమర్శలు
- హిందువులపై పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయని ఆరోపణ
- పీఎఫ్ఐ విద్వేషాలు ఎగదోస్తోందన్న బీజేపీ ఎమ్మెల్యే
ప్రభుత్వ నిఘా వైఫల్యంతో తెలంగాణలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. కేరళలో సిమి ఆర్గనైజేషన్ పై నిషేధం విధిస్తే, ఇప్పుడు నిజామాబాద్ లో పీఎఫ్ఐ రూపంలో వెలిసిందని అన్నారు. తెలంగాణలో మత కల్లోలాలు సృష్టించేందుకు పీఎఫ్ఐ పథకరచన చేస్తోందని, హిందువులపై పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా టెర్రరిస్టులకు అడ్డాగా మారిందని రాజా సింగ్ విమర్శించారు. బోధన్ లో రోహింగ్యాలకు పాస్ పోర్టులు ఇప్పించి పునరావాసం కల్పించింది ఎవరు? అంటూ నిలదీశారు.