Team India: రెండో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్... బౌలింగ్ కు దిగిన టీమిండియా
- పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో మ్యాచ్
- టీమిండియాలో ఒక మార్పు
- ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో అవేష్ ఖాన్
- వన్డేల్లో అరంగేట్రం చేస్తున్న అవేష్ ఖాన్
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా, వెస్టిండీస్ మధ్య నేడు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఇక్కడి క్వీన్స్ పార్క్ ఓవల్ ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఒక మార్పు చేసినట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ వెల్లడించాడు. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో అవేష్ ఖాన్ ను జట్టులోకి తీసుకున్నామని తెలిపాడు. అవేష్ ఖాన్ ఈ మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నాడని ధావన్ వివరించాడు.
కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. ఓపెనర్లు కైల్ మేయర్స్ 6, షాయ్ హోప్ 5 పరుగులతో ఆడుతున్నారు.