Andhra Pradesh: 8 గంటలు ఎందుకు పని చేయరు?... టీచర్లను నిలదీసిన మంత్రి బొత్స!
- డిమాండ్లతో సచివాలయంలో బొత్సను కలిసిన ఉపాధ్యాయ సంఘాలు
- బెదిరిస్తే పనులు కావన్న మంత్రి బొత్స
- అనుకున్నవన్నీ కావాలంటే ఎలాగంటూ నిలదీత
ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, వారికి మద్దతుగా నిలుస్తున్న పీడీఎఫ్ ఎమ్మెల్సీలపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకున్నవన్నీ కావాలని డిమాండ్ చేస్తున్న ఉపాధ్యాయులు... ప్రభుత్వం కోరుతున్నట్లుగా 8 గంటల పాటు ఎందుకు పనిచేయరని ఆయన వారిని నిలదీశారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో తమ డిమాండ్లతో పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు తనను కలిసిన సందర్భంగా మంత్రి బొత్స వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. ఉపాధ్యాయ సంఘాలు బెదిరింపు ధోరణితో డిమాండ్లను సాధించుకునేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించిన మంత్రి... బెదిరిస్తే పనులు కావని తేల్చి చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలు అనుకున్నవన్నీ కావాలంటే ఎలాగంటూ బొత్స ప్రశ్నించారు. ఈ సందర్భంగానే ఉపాధ్యాయులు 8 గంటలు ఎందుకు పనిచేయరని మంత్రి ఉపాధ్యాయ సంఘాలను నిలదీశారు.