Allu Arjun: త్రివిక్రమ్ డైరెక్షన్ లో మరో వాణిజ్య ప్రకటన... కొత్త లుక్ తో షూటింగ్ కు వచ్చిన అల్లు అర్జున్

Allu Arjun spotted with new look at an ad film shooting by Trivikram Srinivas
  • బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో హిట్ చిత్రాలు
  • పలు వాణిజ్య ప్రకటనలు కూడా చేసిన బన్నీ, త్రివిక్రమ్
  • ఇద్దరి కాంబినేషన్ లో మరో యాడ్
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో వంటి హిట్ చిత్రాలే కాదు, పలు వాణిజ్య ప్రకటనలు కూడా వచ్చాయి. త్రివిక్రమ్ తన క్రియేటివిటీతో అనేక వాణిజ్య ప్రకటనలు ఆకట్టుకునే విధంగా రూపొందిస్తుంటారు. 

తాజాగా, అల్లు అర్జున్ తో ఆయన మరో యాడ్ ఫిలిం చిత్రీకరిస్తున్నారు. ఈ యాడ్ షూటింగ్ కు బన్నీ కొత్త లుక్ తో వచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అల్లు అర్జున్ ఇటీవలే థాయ్ లాండ్ లో హరీశ్ శంకర్ తో మరో యాడ్ చేశారు.
Allu Arjun
Ad Film
Shooting
New Look
Trivikram Srinivas
Tollywood

More Telugu News