Ramcharan: చరణ్ పై ఓట్ల లెక్కింపు సీన్ చిత్రీకరణలో శంకర్!

Shankar Movie Update
  • షూటింగు దశలో శంకర్ సినిమా 
  • చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ 
  • చరణ్ జోడీగా కియారా అద్వానీ 
  • వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు  
చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. హీరోగా చరణ్ కి ఇది 15వ సినిమా అయితే, నిర్మాతగా దిల్ రాజుకి ఇది 50వ సినిమా. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా ఈ సినిమా చిత్రీకరణను జరుపుకుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగు సికింద్రాబాదులోని 'విక్టోరియా మెమోరియల్ హాల్' లో జరుగుతోంది. అక్కడ ఓట్ల లెక్కింపు హడావిడిని చిత్రీకరిస్తున్నారు. చరణ్ తదితరులు ఈ సీన్ లో పాల్గొంటున్నారు. ఇది పొలిటికల్ డ్రామా అనే విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి తనయుడిగా చరణ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు.

మరికొన్ని రోజుల పాటు ఇక్కడే షూటింగు జరగనున్నట్టు చెబుతున్నారు. 'వినయ విధేయ రామ' తరువాత చరణ్ జోడీగా కియారా అద్వానీ చేస్తున్న రెండో సినిమా ఇది. ప్రకాశ్ రాజ్ .. శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Ramcharan
Kiara Adwani
Shankar Movie

More Telugu News