Andhra Pradesh: ఏపీలో కొత్త రైల్వే ప్రాజెక్టులు సాధ్యం కావు: కేంద్ర ప్ర‌భుత్వం

railway minister says will allocate no new railway projects to ap

  • ఏపీలో కొన‌సాగుతున్న‌ రూ.70 వేల కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులు
  • కాస్ట్ షేరింగ్ ప‌ద్ద‌తిలోనే ప్రాజెక్టులు చేప‌డుతున్నామ‌న్న అశ్విని వైష్ణ‌వ్‌
  • ఏపీ త‌న వాటా నిధుల‌ను ఇవ్వ‌డం లేద‌ని ఆరోపించిన రైల్వే మంత్రి
  • క‌నీసం ఎంపీ అయినా రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఒప్పించాల‌ని చుర‌క‌

ఏపీకి కొత్త‌గా రైల్వే ప్రాజెక్టుల‌ను ప్ర‌క‌టించ‌డం సాధ్యం కాద‌ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ పార్ల‌మెంటులో పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి అడిగిన ప్ర‌శ్న‌కు ఇచ్చిన లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో కేంద్ర మంత్రి ఈ మేర‌కు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీకి రైల్వే ప్రాజెక్టులు కోరుతున్న ఎంపీ... రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఒప్పించి కేంద్రానికి స‌హ‌క‌రించేలా చేస్తే... ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ప్రాజెక్టులు అయినా త్వ‌రిత‌గ‌తిన పూర్తవుతాయ‌ని మంత్రి వివ‌రించారు. 

ఏపీలో ప్ర‌స్తుతం రూ.70 వేల కోట్ల‌కు పైగా విలువ క‌లిగిన రైల్వే ప్రాజెక్టుల ప‌నులు కొన‌సాగుతున్నాయ‌ని వైష్ణ‌వ్ తెలిపారు. కొత్త ప్రాజెక్టుల‌ను కాస్ట్ షేరింగ్ ప‌ద్ద‌తిని చేప‌డుతున్న‌ట్లు వెల్ల‌డించిన మంత్రి... ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ప్రాజెక్టుల‌కు ఏపీ త‌న వాటాగా రూ.1,798 కోట్లు ఇవ్వాల్సి ఉంద‌ని తెలిపారు. ఈ నిధుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆయ‌న ఆరోపించారు. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఏపీకి కొత్త‌గా రైల్వే ప్రాజెక్టుల‌ను ప్ర‌క‌టించ‌డం సాధ్యం కాద‌ని మంత్రి తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News