Sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 548 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 158 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 3.39 శాతం పెరిగిన సన్ ఫార్మా షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లో రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. కీలక కౌంటర్లలో కొనుగోళ్లు, ఆశాజనకంగా ఉన్న కార్పొరేట్ ఫలితాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 548 పాయింట్లు పెరిగి 55,816కి చేరుకుంది. నిఫ్టీ 158 పాయింట్లు పుంజుకుని 16,641కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (3.39%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.76%), ఎల్ అండ్ టీ (2.67%), టీసీఎస్ (2.33%), ఏసియన్ పెయింట్స్ (2.31%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-1.32%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.17%), ఎన్టీపీసీ (-0.10%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.09%), రిలయన్స్ (-0.05%).