Adhir Ranjan Chowdhury: 'రాష్ట్రపత్ని' వ్యాఖ్యల వివాదం... అధిర్ రంజన్ చౌదరికి మహిళా కమిషన్ నోటీసులు

NCW issues notice to Adhir Ranjan Chowdhury in Rashtra Patni remarks row
  • ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అని పేర్కొన్న కాంగ్రెస్ నేత
  • తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్
  • ఆగస్టు 3న విచారణకు రావాలంటూ నోటీసులు
  • సోనియాకు లేఖ.. చౌదరిపై చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అని పేర్కొనడం ద్వారా కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది. అధిర్ రంజన్ చౌదరికి నోటీసులు జారీ చేసింది. తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని, వ్యాఖ్యల పట్ల లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఆగస్టు 3వ తేదీ ఉదయం 11.30 గంటలకు విచారణ ఉంటుందని వెల్లడించింది.

అంతేకాదు, జాతీయ మహిళా కమిషన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా లేఖ రాసింది. ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన అధిర్ రంజన్ చౌదరిపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
Adhir Ranjan Chowdhury
NCW
Notice
Rashtra Patni
Droupadi Murmu
President Of India
Congress
India

More Telugu News