AP High Court: సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

 AP High Court fires on CM Special Chief Secretary
  • ఇరిగేషన్ ఉద్యోగి బకాయిల చెల్లింపు వ్యవహారం
  • కోర్టుకు రావాలని జవహర్ రెడ్డికి ఆదేశాలు
  • గైర్హాజరైన జవహర్ రెడ్డి
  • నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందన్న కోర్టు
ఓ ఇరిగేషన్ ఉద్యోగి బకాయిల చెల్లింపు వ్యవహారంలో ఏపీ సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు హాజరు కావాలని తాము ఆదేశించినా, జవహర్ రెడ్డి రాకపోవడంతో హైకోర్టు ధర్మాసనం మండిపడింది. 

మరోసారి తమ ఆదేశాలను పాటించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడితే వివరణ కూడా కోరకుండా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందని ఘాటు హెచ్చరిక చేసింది. కోర్టుకు రాలేనంత తీరిక లేకుండా ఉన్నారా? అంటూ ప్రశ్నించింది.
AP High Court
Jawahar Reddy
Special Chief Secretary
Chief Minister
Andhra Pradesh

More Telugu News