Team India: కామన్వెల్త్ క్రీడల్లో ఆసీస్ ముందు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా అమ్మాయిలు

Team India eves set 155 runs target to Australia in Commonwealth Games

  • కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్
  • తొలి మ్యాచ్ లో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు
  • రాణించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్, షెఫాలీ

బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో ఈసారి మహిళల క్రికెట్ కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్ లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఇక్కడి ఎడ్జ్ బాస్టన్ మైదానంలో టాస్ గెలిచిన టీమిండియా అమ్మాయిల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 

నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (34 బంతుల్లో 52 పరుగులు; 8 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి అర్ధసెంచరీ నమోదు చేసుకోగా, ఓపెనర్ షెఫాలీ వర్మ 33 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధన 17 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో జొనాస్సెన్ 4 వికెట్లు తీయగా, షట్ 2, డార్సీ బ్రౌన్ 1 వికెట్ తీశారు. 

అనంతరం, 155 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ జట్టు టీమిండియా బౌలర్ రేణుకా సింగ్ ధాటికి 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ అలీసా హీలీ (0) డకౌట్ కాగా, మరో ఓపెనర్ బెత్ మూనీ (10), కెప్టెన్ మెగ్ లానింగ్ (8) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఈ మూడు వికెట్లు రేణుకా సింగ్ ఖాతాలోకే చేరాయి. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 3 ఓవర్లలో 3 వికెట్లకు 21 పరుగులు. క్రీజులో తహ్లియా మెక్ గ్రాత్, రాచెల్ హేన్స్ ఉన్నారు.

  • Loading...

More Telugu News