Satyavathi Rathod: తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ కు మాతృవియోగం

Minister Satyavathi Rathod mother passed away
  • కన్నుమూసిన గుగులోత్ దస్మా
  • ఆమె వయసు 86 సంవత్సరాలు
  • ఇటీవల అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చేరిక
  • నేడు గుండెపోటుతో మృతి
  • సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు మాతృవియోగం కలిగింది. సత్యవతి రాథోడ్ తల్లి గుగులోత్ దస్మా ఇవాళ కన్నుమూశారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా, నేడు గుండెపోటుకు గురయ్యారు. 

గుగులోత్ దస్మా మృతి పట్ల సీఎం కేసీఆర్ స్పందించారు. మాతృవియోగంతో బాధపడుతున్న మంత్రి సత్యవతి రాథోడ్ కు సంతాపం తెలియజేశారు.
Satyavathi Rathod
Guguloth Dasma
Mother
Demise
TRS
Telangana

More Telugu News