YSRCP: జగన్ గారి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం ఇది: విజ‌య‌సాయిరెడ్డి

viyaj sai reddy tweet on ap stands in third position in pds
  • జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో తృతీయస్థానంలో ఏపీ
  • రాజ్య‌స‌భ‌లో సాయిరెడ్డి ప్ర‌శ్న‌కు కేంద్రం స‌మాధానం
  • రాష్ట్రంలో పేద‌ల‌కు వారి ఇళ్ల వ‌ద్ద‌కే రేష‌న్ అందుతోంద‌న్న సాయిరెడ్డి
ఏపీలో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తోంద‌ని ఆ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చెప్పారు. ఇందుకు కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంటు వేదిక‌గా ఇచ్చిన లిఖిత‌పూర్వ‌క స‌మాధాన‌మే నిద‌ర్శ‌న‌మ‌ని కూడా ఆయ‌న శ‌నివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. 

జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో ఏపీ తృతీయస్థానంలో నిలిచిందని.. రాజ్యసభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్రప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానమే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని సాయిరెడ్డి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదలకు ఇబ్బంది లేకుండా వారి ఇళ్ల వద్దకే ప్రభుత్వం రేషన్ అందిస్తోందని ఆయ‌న‌ వెల్ల‌డించారు. రేషన్ పంపిణీలో జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధికిది నిదర్శనమ‌ని సాయిరెడ్డి పేర్కొన్నారు.
YSRCP
YS Jagan
Andhra Pradesh
Vijay Sai Reddy
Rajya Sabha
PDS
Ration

More Telugu News