Partha Chatterjee: అర్పిత ముఖర్జీ ఇంట్లో దొరికిన డబ్బుతో నాకు సంబంధం లేదు: పార్థ ఛటర్జీ

Partha Chatterjee says money seized by ED was not belonged to him
  • బెంగాల్ లో కోట్లాది రూపాయల టీచర్ ఉద్యోగాల స్కాం
  • మాజీ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలి ఫ్లాట్లలో సోదాలు
  • రూ.50 కోట్ల మేర స్వాధీనం చేసుకున్న ఈడీ
  • ఈడీ కస్టడీలో పార్థ ఛటర్జీ, అర్పిత ముఖర్జీ
టీచర్ రిక్రూట్ మెంట్ స్కాంలో అరెస్టయిన బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ ప్రస్తుతం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్నారు. ఇటీవల ఈడీ అధికారులు అర్పిత ముఖర్జీకి చెందిన రెండు ఫ్లాట్లలో తనిఖీలు చేయగా, రూ.50 కోట్ల వరకు నగదు పట్టుబడడం తెలిసిందే. 

అయితే, ఆ డబ్బుతో తనకు సంబంధంలేదని పార్థ ఛటర్జీ అంటున్నారు. తనకు వ్యతిరేకంగా ఎవరు కుట్ర చేస్తున్నారో కాలమే జవాబు చెబుతుందని అన్నారు. సమయం వచ్చినప్పుడు వాస్తవాలు ఏంటో అందరికీ తెలుస్తాయని పేర్కొన్నారు. తనను మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయడం నిష్పాక్షిక విచారణ కోసమేనని పార్థ ఛటర్జీ తెలిపారు. 

కాగా, తన ఫ్లాట్లలో దొరికిన డబ్బు పార్థ ఛటర్జీదేనని, ఆయన ఆ రెండు గదులకు తాళాలు వేసుకునేవారని, తనను కూడా ఆ గదుల్లోకి అనుమతించేవారు కాదని అర్పిత ముఖర్జీ పేర్కొనడం తెలిసిందే.
Partha Chatterjee
Money
Arpitha Mukherjee
ED
Teachers Recruitment Scam
West Bengal

More Telugu News