Gyanvapi Masjid: 'జ్ఞానవాపి మసీదు కేసు'లో ముస్లింల తరపు న్యాయవాది గుండెపోటుతో మృతి

Counsel for Muslim side in Gyanvapi Masjid case dies of heart attack

  • హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలిన అభయ్‌నాథ్ యాదవ్
  • ఆసుపత్రికి తీసుకెళ్లే సరికే మృతి
  • జ్ఞానవాపి, శృంగార్ గౌరి కేసుల్లో కీలకంగా  వ్యవహరిస్తున్న అభయ్‌నాథ్

జ్ఞానవాపి మసీదు, శృంగార్ గౌరి కేసు కేసుల్లో ముస్లింల తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అభయ్‌నాథ్ యాదవ్ గత రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. హార్ట్‌ ఎటాక్‌తో కుప్పకూలిన ఆయనను వెంటనే వారణాసిలోని మక్బూల్ ఆలం రోడ్డులోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 

జ్ఞానవాపి, శృంగార్ గౌరి కేసుల్లో మెయింటెనబిలిటీ (వినడం, వినకపోవడం) అంశంపై అన్ని పార్టీలు ఇప్పటికే తమ వాదనలు ముగించాయి. ఈ నెల 4న ముస్లిం పక్షం నుంచి జవాబు రావాల్సి ఉంది. ముస్లిం తరపు నుంచి న్యాయవాది అభయ్‌నాథ్ ఈ కేసుల్లో ముఖ్య పాత్ర పోషించారు.

  • Loading...

More Telugu News