Prime Minister: ప్రధాని ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ గా త్రివర్ణ పతాకం

PM Modi changes display picture of his social media accounts
  • సోషల్ మీడియా పేజీల్లో డీపీని మార్చానన్న ప్రధాని  
  • ప్రొఫైల్ పిక్ గా జాతీయ పతకాన్ని పెట్టుకోవాలని పిలుపు
  • మువ్వన్నెల జెండా పండగకు సమష్టి చర్యలు అవసరమన్న ప్రధాని
ప్రధాని ట్విట్టర్ ఖాతాను పరిశీలిస్తే ఓ మార్పు కనిపిస్తుంది. తన ప్రొఫైల్ పిక్ గా జాతీయ పతాకాన్ని పెట్టుకున్నారు. మంగళవారం ఈ మార్పు కనిపించింది. ఆగస్ట్ 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరు తమ ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాను పెట్టుకోవాలంటూ ప్రధాని మోదీ పిలుపునివ్వడం తెలిసిందే. దీంతో 2వ తేదీ నుంచి ప్రధాని సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్ పిక్ గా త్రివర్ణ పతాకం కనిపిస్తోంది. 

‘‘నేడు ప్రత్యేకమైన ఆగస్ట్ 2. అజాదీకా అమృత్ మహోత్సవాలను జరుపుకుంటున్న వేళ.. యావత్ దేశం హర్ ఘర్ తిరంగా కోసం సిద్ధంగా ఉంది. మన త్రివర్ణ పతాకాన్ని సంబరంగా జరుపుకునేందుకు సమష్టి చర్యలు అవసరం. నా సోషల్ మీడియా పేజీల్లో డీపీని మార్చాను. మీరు కూడా అదే పని చేయాలి’’ అని ప్రధాని కోరారు. ప్రధాని పిలుపు మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా సైతం తమ ప్రొఫైల్ పిక్ లను మార్చుకున్నారు.
Prime Minister
Narendra Modi
profile pic
twitter
chnages

More Telugu News