YSRCP: కార్పొరేట్ల ప‌న్ను ఎగ‌వేత‌ల వ‌ల్ల దేశానికి క‌లిగిన న‌ష్ట‌మెంత‌?: రాజ్యసభలో విజ‌య‌సాయిరెడ్డి

ysrcpp leader asks union government over tax evations of corporates

  • ప‌న్ను ఎగ‌వేత‌ను అడ్డుకునేందుకు ఏం చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌న్న విజయసాయి 
  • ప్రభుత్వం వద్ద ఇందుకు లెక్కలున్నాయా? అని ప్రశ్న  
  • ప‌న్ను ఎగ‌వేత‌ల న‌ష్టంపై వివ‌రాలు ఉన్నాయా? అని అడిగిన వైసీపీ ఎంపీ

వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి మంగ‌ళ‌వారం రాజ్య‌స‌భ‌లో కేంద్ర ఆర్ధిక మంత్రికి ఓ ఆసక్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌ను వేశారు. దేశంలో కార్పొరేట్ సంస్థ‌లు ప‌న్నులు (క‌స్ట‌మ్స్ డ్యూటీ) ఎగ‌వేస్తున్న వైనాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని ఆయ‌న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్‌ను ప్ర‌శ్నించారు. 

అంతేకాకుండా ఇప్ప‌టిదాకా ఆయా కార్పొరేట్ సంస్థ‌లు పాల్ప‌డిన ప‌న్ను ఎగ‌వేత‌ల కార‌ణంగా దేశానికి ఎంత మేర న‌ష్టం వాటిల్లింది?.. ఈ విష‌యంపై ప్ర‌భుత్వం వ‌ద్ద‌ ఏమైనా లెక్కలున్నాయా?.. ఆ దిశ‌గా ఇప్ప‌టిదాకా ఏమైనా వివ‌రాలు సేక‌రించారా? అని కూడా ఆయ‌న కేంద్రాన్ని ప్ర‌శ్నించారు.

  • Loading...

More Telugu News